![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -285 లో....సత్యరాజ్ రెస్టారెంట్ ని కొనడానికి జ్యోత్స్న వెళ్తుంది. తన ప్రపోజల్ సత్యరాజ్ ముందు పెట్టి.. బయట వెయిట్ చేస్తుంది. ఆ తర్వాత లోపలికి దీప, కార్తీక్ లు వెళ్తారు. నీ వల్లే నేను రెస్టారెంట్ దివాలా తీసి అమ్మే సిచువేషన్ వచ్చింది.. జ్యోత్స్న రెస్టారెంట్ కి మార్క్ క్రియేట్ చేసావని సత్యరాజ్ అంటాడు. అసలు మీరెందుకు వచ్చారని కార్తీక్, దీపలని అతను అడుగుతాడు. రెస్టారెంట్ కొనడానికి కాదు డెవలప్ చెయ్యడానికి అని కార్తీక్ అంటాడు.
దీప ఒక వంటకం తన వెంట తీసుకొని వచ్చి సత్యరాజ్ కి తినమని ఇస్తుంది. అది తిని చాలా బాగుందంటూ సత్యరాజ్ మెచ్చుకుంటాడు. ఇది నేనే చేసాను చాలా వంటకాలు వచ్చు.. కార్తీక్ బాబుకి బిజినెస్ ని ఎలా రన్ చెయ్యాలో తెలుసు.. ఈ రెస్టారెంట్ మాకు ఇవ్వండి అని దీప అడుగుతుంది. కుదరదని సత్యరాజ్ అంటాడు. ప్లీజ్ సర్ అంటూ కార్తీక్, దీపలు రిక్వెస్ట్ చేస్తారు. సర్ మీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తామని బయట వెయిట్ చేస్తారు. సత్యరాజ్ బయటకు వచ్చి నా రెస్టారెంట్ ని కార్తీక్ కి ఇస్తున్నానని చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. కార్తీక్, దీపలు హ్యాపీగా ఫీల్ అవుతారు. జ్యోత్స్న పొగరుగా... నా కన్న వాళ్ళు ఎక్కువ డబ్బు ఇస్తానన్నారా అని అంటుంది. లేదు నా రెస్టారెంట్ ని వాళ్ళకి డెవలప్‌మెంట్ కి ఇస్తున్నానని సత్యరాజ్ అనగానే. జ్యోత్స్న కోపంగా అక్కడి నుండి వెళ్తుంది. సత్యరాజ్ మనవడు తన దగ్గరికి వస్తాడు. ఈ బాబుని గుర్తు పట్టావా అని దీపని సత్యరాజ్ అడుగగా.. గుర్తుపట్టానని అంటుంది. ఎవరు అని కార్తీక్ అడుగుతాడు. దీప వల్లే నా మనవడు ఇలా ఉన్నాడు.. ఆ రోజు నా మనవడిని కాపాడావని సత్యరాజ్ తన కొడుకు ని కార్తీక్ దీపలకి పరిచయం చేస్తాడు. ఇందాకే నా కొడుకు దీప గురించి చెప్పాడని సత్యరాజ్ అంటాడు.
ఆ తర్వాత దీపని కార్తీక్ తీసుకొని శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు. బయట ఉండే ఇంట్లో వాళ్లని పిలుస్తాడు కార్తీక్. ఏంటి నువ్వు గెలిచావని చెప్పుకోవడానికి వచ్చావా అంటూ కార్తీక్ తో చులకనగా మాట్లాడుతాడు శివన్నారాయణ. తాత, మనవడి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |